ఇసి తీరు సరికాదు : వైసిపి

May 7,2024 23:29 #firyadu, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనితీరు సరిగ్గా లేదని వైసిపి విమర్శించింది. బిజెపితో కలిసి వుందని టిడిపి ఏది చెబితే అది అమలు చేయడం తగదని పేర్కొంది. నాలుగేళ్లుగా అమలులో వున్న పథకాలను ఎన్నికల సంఘం నిలిపేయడం ఏమిటని ప్రశ్నించింది. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, పార్టీ మహిళా విభాగం అధ్యక్షులు పోతుల సునీత, నాయకులు అడపా శేషు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ వున్నప్పుడు కొత్త పథకాలకు అభ్యంతరం చెప్పొచ్చుగానీ ఇప్పటికే అమలులో వున్న పథకాలను రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిలిపేసిందన్నారు. అలాగే టిడిపి చెప్పిందని ఎన్నికల కమిషన్‌ రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా అధికారులను బదిలీ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్‌ స్పందించకపోవడం సరైందికాదన్నారు.

➡️