ED: కవిత ఇంట్లో ఈడీ సోదాలు

Mar 15,2024 15:13 #ED raids, #mlc kavita, #Telangana

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీతో పాటు ఐటి సోదాలు కూడా నిర్వహించారు. కవిత భర్త వ్యాపారాలపై ఈడీ అధికారులు అరా తీస్తున్నారు. ఢిల్లీ నుండి వచ్చిన ఇద్దరు మహిళా అధికారులతో సహా 10మంది అధికారుల బృందం నాలుగు టీంలుగా ఏర్పడి సోదాలు జరుపుతున్నారు. కవిత రెండు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఆమె వద్ద నుండి అధికారులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️