తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఎన్నికల సంఘం అనుమతి

May 24,2024 17:50 #Telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణ వేడుకలను నిర్వహించనున్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అవతరణ వేడుకలకు ఈసీ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జూన్ 2న నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. వేడుకలకు తగిన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలను ఆదేశించారు.

➡️