Elephants: చిత్తూరు జిల్లా ఐరాలలో ఏనుగుల హల్ చల్

Mar 10,2024 11:17 #chitoor, #district, #elephant

ప్రజాశక్తి-చిత్తూరు : జిల్లాలో ఐరాల మండలం చుక్క వారి పల్లి లో ఏనుగుల సంచారం చేస్తున్నాయి. దాదాపు 19 ఎనుగులు ఒక్కసారిగా అడవి నుంచి బయటకు వచ్చి.. పంటపొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల సంచారం తో పరిసర ప్రాంతాల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంట నాశనం అవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

➡️