కన్యాదానం జరగకున్నా.. ఏడడుగులు కలిసి నడిస్తే వివాహమైనట్లే : హైకోర్టు

Apr 9,2024 11:34 #alahabad High Court, #judgement

హైదరాబాద్‌: హిందూ వివాహ చట్టం కింద పెళ్లి జరిగింది అనడానికి కన్యాదానం ప్రమాణం కాదనీ అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే (సప్తపది) వారు దంపతులైనట్లు లెక్క అని పేర్కొంది. ఈ మేరకు మార్చి 22వ తేదీన ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అశుతోశ్‌ యాదవ్‌ అనే వ్యక్తి రివిజన్‌ పిటిషన్‌ను విచారించిన సందర్భంలో ఈ విషయాన్ని హైకోర్టు తేల్చి చెప్పింది. యాదవ్‌ మీద అత్తింటి వారు దాఖలు చేసిన క్రిమినల్‌ కేసుపై లక్నో అదనపు సెషన్స్‌ జడ్జి వెలువరించిన తీర్పుపై అతను హైకోర్టుకు వెళ్లారు. తన పెళ్లి సమయంలో కన్యాదానం జరగలేదు కాబట్టి వివాహం చెల్లదని వాదించారు. దానికి హైకోర్టు. హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపదే ముఖ్యమని నిర్ధారించింది. కన్యాదానం ప్రమాణం కాదని స్పష్టం చేస్తూ తీర్పును వెలువరించింది.

➡️