సిఎం జగన్‌పై దాడి ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Apr 14,2024 16:03 #ap cm jagan, #attack, #FIR

సింగ్‌ నగర్‌ , గన్నవరం :  ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు సిఎం జగన్‌పై హత్యాయత్నం జరిగినట్లు అజిత్‌ సింగ్‌ నగర్‌ పోలీసులు పేర్కొన్నారు. ఐపీసీ 307 సెక్షన్‌ కింద విజయవాడ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వెల్లంపల్లి నివాసానికి వెళ్లి ఫిర్యాదు, స్టేట్‌ మెంట్‌ను రికార్డు చేసినట్లు తెలిపారు.

శనివారం విజయవాడ సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంటర్‌లో మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా  సిఎం  జగన్  బస్సుపై నుండి ప్రజలకు అభివాదం చేస్తుండగా  రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే.

➡️