Visakha కింగ్‌ జార్జి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

విశాఖ : విశాఖలోని ప్రముఖ కింగ్‌ జార్జి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. సిఎస్‌ఆర్‌ బ్లాక్‌ మూడో అంతస్తులోని వెంటిలేటర్‌ మెషిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డు మొత్తం దట్టంగా పొగ అలుముకోవడంతో వెంటనే సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది రోగులను హుటాహుటిన పక్క వార్డుకు తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. మంటలను ఆర్పేయారు. ప్రమాద సమయంలో వార్డులో ఎనిమిది మంది రోగులు చికిత్స పొందుతున్నారని సూపరింటెండెంట్‌ శివానంద్‌ తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణపాయం తప్పిందని ఆయన వెల్లడించారు.

➡️