ఎఫ్‌ఎంఆర్‌ఎఐ అఖిల భారత సభ(లైవ్)

fmrai all india conference in vijayawada

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్ సర్ప్రైజెస్ యూనియన్ అఖిల భారత సభ విజయవాడలో బుధవారం ప్రారంభమైయ్యాయి.  ఈ సందర్భంగా మందులపై జిఎస్‌టిని ఎత్తివేయాలని, మెడికల్‌ సేల్స్‌ రిప్రజంటేటివ్‌లకు కార్మిక చట్టాలు అమలుచేసి కనీస వేతనం ఇవ్వాలని యూనియన్ నేతలు డిమాండ్ చేసింది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్‌టి పేరుతో అన్ని రకాల వస్తువులపై పన్నులు పెంచిందని విమర్శించారు. మందులపై కూడా కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని విధించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఫార్మా సంస్థలు, వ్యాక్సిన్‌ కంపెనీలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఫార్మారంగంలో పనిచేస్తున్న మెడికల్‌ రిప్స్‌కు కార్మిక చట్టాలను వర్తింపజేయాలన్నారు. కనీస వేతనాలు అమలు చేసే విధంగా ఫార్మా కంపెనీలకు ఉత్తర్వులివ్వాలని కోరారు. సిఐటియు నగర నాయకులు పి.కిషోర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారాలు మోపుతున్నాయని విమర్శించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు వారి నిజ వేతనాలు తగ్గి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

➡️