యోగి వేమన వర్సిటీ హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 22,2024 14:52 #Kadapa, #yogi vemana university

కడప : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం వసతి గహంలో ఫుడ్‌పాయిజన్‌ కారణంగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి యూనివర్సిటీ వసతి గృహంలోని విద్యార్థులు వంకాయ కూర, రసంతో అన్నం తిన్నారు. తిన్న తర్వాత వారికి వాంతులు, విరేచనాలు కావడంతో యూనివర్సిటీ అధికారులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో.. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఫుడ్‌ పాయిజన్‌కు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం విద్యార్థి సంఘం నాయకులు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.

➡️