రాష్ట్రం విడిపోవడానికి కారకుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

  • రానున్న ఎన్నికలలో ఇద్దరికీ బుద్ధి చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ప్రజాశక్తి-సోమల: రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని, రిజర్వాయర్ల నిర్మాణాన్ని కోర్టుల ద్వారా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడని రానున్న ఎన్నికలలో వీరిద్దరికీ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని 15 పంచాయతీలలో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. 81 చిన్న ఉప్పరపల్లి పంచాయతీలో ప్రారంభం అయిన మంత్రి పర్యటన పేటూరు, అన్నెమ్మ గారి పల్లి, పెద్ద ఉప్పరపల్లి పంచాయతీలలో ప్రారంభమై మిగిలిన పంచాయతీలలో పర్యటన కొనసాగుతూ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరం సీఎంగా ఉండి రాష్ట్రం విడిపోవడానికి కారకులు అయ్యారని అదేవిధంగా రాజధాని లేకుండా చేశాడని అన్నారు. రైతుల ప్రజల సంక్షేమం త్రాగు సాగునీరు అందించే లక్ష్యంతో మూడు రిజర్వాయర్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కాగా కోర్టులకు వెళ్లి వాటి నిర్మాణాలు జరక్కుండా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడని ఇలాంటి రైతు ద్రోహికి ఓట్లు వేసి గెలిపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు.

➡️