మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు ఊరట..

Apr 21,2024 14:42 #Ex-DCP Radhakishan Rao, #Relieved

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు టాస్క్‌ ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావుకు ఊరట లభించింది. కరీంనగర్‌ లోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు అవకాశం కల్పిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా.. జైలు ఎస్కార్ట్‌ బందోబస్తు మధ్య కరీంనగర్‌ కు తరలించనున్నారు.

➡️