మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్‌

May 18,2024 14:30 #arrest, #ex minster mallareddy

హైదరాబాద్‌: మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్‌ అయ్యారు. పోలీసుల అదుపులో మాజీమంత్రి మల్లారెడ్డి ఉన్నారు. మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు పోలీసులు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సఅష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే ..మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్‌ అయ్యారు. పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.

➡️