భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ

Dec 14,2023 11:41 #MLA Malla Reddy
  • కబ్జాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్య
  • న్యాయపోరాటం చేస్తానని స్పష్టం

హైదరాబాద్‌ : మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనపై కేసు నమోదైన విషయం వాస్తవమేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. భూకబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. భూకబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. గిరిజనుల 47 ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని.. గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు.

➡️