ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేదు : లోకేశ్‌

Dec 9,2023 12:45 #Nara Lokesh, #project, #speech

అమరావతి : ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా సిఎం జగన్‌ నిధులు ఇవ్వలేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. శనివారం ఉదయం గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద విరిగిన రెండో గేటును టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, స్వామి, తెదేపా ఇన్‌ఛార్జి విజయకుమార్‌ తదితరులు పరిశీలించారు. టిడిపి నేత అచ్చెన్న మాట్లాడుతూ … ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై లోకేశ్‌ మాట్లాడుతూ … సిఎం జగన్‌ ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ, పాలన గాలికొదిలేశారని అన్నారు. ప్రజాధనం దోచి దాచుకునే బిజీలో ఉండి సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, ఉన్న వాటి నిర్వహణను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టు గేట్లకు గ్రీజు పెట్టేందుకు కూడా నిధులు ఇవ్వలేని దిక్కుమాలిన పాలనలో.. గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు విరిగిపోయిందని మండిపడ్డారు. గతేడాది గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో గేటు కొట్టుకుపోయిందన్న లోకేశ్‌.. నీరు వఅథాగా పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీఎంసీ – క్యూసెక్కుకు తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని లోకేశ్‌ నిప్పులుచెరిగారు.

➡️