కారులో గ్యాస్ లీక్.. అమెరికాలో విజయవాడ వైద్య విద్యార్థిని మృతి

Dec 21,2023 11:00 #America, #death, #Indian student

ప్రజాశక్తి-విజయవాడ : ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన షేక్‌ జహీరా నాజ్‌ (22) నగరంలోని ఓ కళాశాలలో ఫిజియోథెరపీ డిగ్రీ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్‌ చేయడానికి అమెరికాలోని షికాగోకు వెళ్లారు. నగరంలో బుధవారం కారులో ప్రయాణిస్తుండగా గ్యాస్‌ లీకవడంతో డ్రైవర్‌తో పాటు జహీరా నాజ్‌ స్పృహ తప్పారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థిని మృతికి సంబంధించి పూర్తి వైద్య నివేదిక రావాల్సి ఉంది.

➡️