ప్రకాశం బ్యారేజ్‌కు 2023లో ప్రపంచ గుర్తింపు

Dec 30,2023 17:10 #Prakasam Barrage

విజయవాడ: దక్షిణ భారత దేశంలోని పలు కట్టడాలు, ప్రదేశాలు 2023 సంవత్సరంలో ప్రపంచ సాంస్కృతిక, వారసత్వ సంపదగా గుర్తింపు పొందాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ ఒకటి. ది ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజి(ఐసీఐడీ)ప్రకాశం బ్యారేజ్‌ను 2023లో ప్రపంచ వారసత్వ ఇరిగేషన్‌ నిర్మాణంగా ప్రకటించింది.విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీఐడీ అధ్యక్షుడు వరల్డ్‌ హెరిటేజ్‌ ఇరిగేషన్‌ స్ట్రక్చర్‌(డబ్ల్యూహెచ్‌ఐఎస్‌) అవార్డును ఆంధ్రప్రదేశ్‌కు అందించారు.ఇప్పటివరకు భారత దేశానికి 14 డబ్ల్యూహెచ్‌ఐఎస్‌ అవార్డులు రాగా వీటిలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు అవార్డులు వరించాయి.

➡️