శంషాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Jan 1,2024 15:57 #Gold, #hyderabad

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి రూ.3 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. వీరు దుబారు నుంచి బంగారం తరలిస్తున్నట్లు తెలిపారు.

➡️