Good Friday సందేశం – సిఎం జగన్‌ ట్వీట్‌

Mar 29,2024 11:20 #ap cm jagan, #Good Friday, #message, #Tweet

కర్నూలు : గుడ్‌ ఫ్రైడే సందర్భంగా …. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. మానవాళి కోసం జీసస్‌ చేసిన త్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే. ఒక ప్రకటనలో.. ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్‌ ఫ్రైడే.. జీసస్‌ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని అన్నారు. ”ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు” అని పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్‌ లోకానికి ఇచ్చిన సందేశాలు” అని సిఎం జగన్‌ అన్నారు.

➡️