భళా..బాలికా!

ఇంటర్‌ పలితాల్లో హవా
మొదటి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లా
మే 24 నుంచి సప్లమెంటరీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలో వారిదే హవా!
ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్య్టదర్శి సౌరబ్‌ గౌర్‌ తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఇంటర్‌ ఫలితాలు విడుదల చేశారు. మొదటి సంవత్సరం జనరల్‌ విభాగంలో బాలికలు 71శాతం, ద్వితీయ సంవత్సరంలో 81శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కోర్సుల మొదటి సంవత్సరంలో 70శాతం, ద్వితీయ సంవత్సరంలో 80శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. జనరల్‌ విభాగంలో బాలురు మొదటి సంవత్సరంలో 64శాతం, ద్వితీయ సంవత్సరంలో 75శాతం ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్‌ విభాగం ప్రధమ సంవత్సరంలో 47శాతం, ద్వితీయ సంవత్సరంలో 59శాతం మంది ఉత్తీర్ణులయారు.
మొదటి సంవత్సరం పరీక్షలు 4,61,273 మంది రాయగా 3,10,875 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 3,93,757మంది రాయగా 3,10,875 మంది పాస్‌ అయ్యారు. ఒకేషనల్‌ కోర్సుల్లో మొదటి సంవత్సరం 38,483 మంది పరీక్షకు హాజరయితే 23,181(60శాతం) మంది అర్హత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 32,339 మందిలో 23,000(71శాతం) మంది పాస్‌ అయ్యారు. ప్రథమ సంవత్సరంలో 84శాతం, ద్వితీయ సంవత్సరంలో 90శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం నిలిచింది. మొదటి సంవత్సరంలో 81 శాతంతో, ద్వితీయ సంవత్సరంలో 87శాతంతో గుంటూరు జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచింది. 48శాతంతో మొదటి సంవత్సరంలో అల్లూరి సీతరామరాజు జిల్లా, 63శాతంతో ద్వితీయ సంవత్సరంలో చిత్తూరు జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. ఫలితాలను తీవరబశ్ర్‌ీరbఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు పొందుపరిచారు.
మే 24 నుంచి సప్లమెంటరీ
ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ ఫలితాలను మే 24వ తేది నుంచి నిర్వహిస్తామని కార్యదర్శి సౌరబ్‌ గౌర వెల్లడించారు. రోజుకు రెండు పూటల పరీక్ష ఉంటుందని, జూన్‌ 1వ తేది వరకు సప్లమెంటరీ జరుగుతాయని చెప్పారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటలకు వరకు ఉంటాయని చెప్పారు. ప్రాక్టీకల్‌ పరీక్షలు మే 1 నుంచి 4వ తేది వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్ష ఫీజును ఈ నెల 18 నుంచి 24వ తేది లోపు విద్యార్థులు చెల్లించాలని చెప్పారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ నెల 18 నుంచి 24వ తేదివరకు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
జనరల్‌ విద్యార్ధులు
సంవత్సరం   హాజరైన వారు     ఉత్తీర్ణత సాధించిన వారు     శాతం
మొదటి          4,61,273              3,10,875                   67
ద్వితీయ         3,93,757             3,06,528                   78

వొకేషనల్‌ విద్యార్ధులు
సంవత్సరం     హాజరైన వారు     ఉత్తీర్ణత సాధించిన వారు   శాతం
మొదటి            38,483                23,181                         60
ద్వితీయ           32,339               23,000                          71

➡️