రూ.కోటి ఆఫర్‌ వచ్చింది.. నిన్ను త్వరలో చంపేస్తా : స్థిరాస్తి వ్యాపారికి బెదిరింపు కాల్‌

రాజేంద్రనగర్‌ (తెలంగాణ) : ‘నిన్ను చంపడానికి రూ.కోటి ఆఫర్‌ వచ్చింది. ఇప్పటికే రూ.50 లక్షలు అడ్వాన్స్‌ అందింది. నీ గురించి పూర్తి వివరాలు నాకు తెలుసు. నిన్ను త్వరలో చంపేస్తా’ అంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుండి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పరపల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారి సామ దామోదర్‌ రెడ్డికి బెదిరింపు కాల్‌ వచ్చింది. దామోదర్‌ రెడ్డికి గతంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపు కాల్‌ రావడంతో సదరు నాయకుడి అనుచరులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేంద్రబాబు మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాలేదని తెలిపారు.

➡️