అంగన్వాడీ నాయకులతో జరిగిన చర్చలు విఫలం

Dec 27,2023 08:59 #Anganwadi strike, #charchalu

అమరావతి: గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నిరసన, దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడీలను చర్చలకు ఆహ్వానించింది. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం తరఫున బత్స సత్యనారాయణ , సజ్జలు రామక్రిష్ణ రెడ్డి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ,ఐసీడీఎస్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, కే.సుబ్బరావమ్మ, జి. లలితమ్మ,వి. జ్యోతి, ఈ చర్చల్లో పాల్గొన్నారు. ”ఈ చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించింది. దీనికి నిరసనగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేయాలని మూడు సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. కొత్త విషయం ఒకటి కూడా మాట్లాడలేదు. పాత విషయాల్ని చెబుతూ జీతాలు పెంచేటువంటి విషయాన్ని 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడతావని చెప్పి చర్చల్ని వాయిదా వేయాలని కోరారు. యూనియన్‌ నాయకులు అంగీకరించలేదు… గత సమావేశం తర్వాత పది రోజులు టైం తీసుకుని కూడా ఇప్పుడు దాకా ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదనేది సరైంది కాదు. కేవలం జాప్యం చేయడానికి ఆలస్యం చేస్తే వాళ్లే లంగి వస్తారులే అనేటువంటి తప్పుడు వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది.ఎంతకాలమైనా ఎన్ని రోజులు అయినా అంగన్వాడీలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఇటువంటి జాప్యం చేసేటువంటి ఎత్తుగడలు రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలి. బాధ్యతగా సమస్యను పరిష్కారం చేయాలి .ఎస్సీ,ఎస్టీ ,బీసీ, ఒంటరి మహిళలు లక్ష మంది పైగా సమ్మె చేస్తుంటే ఈ విధమైనటువంటి వైఖరి తీసుకోవడం సరైనదికాదు..మహిళలపట్ల ప్రభుత్వం వైఖరి దుర్మార్గమైనది.రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగించాలని ,ఇతర కార్మిక సంఘాలు మహిళా సంఘాలు సామాజిక సంఘాలు రాజకీయ పార్టీల సహకారం కోసం పోరాటాన్ని ఉదఅతం చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలని కార్మిక వర్గాన్ని సమీకరించి సంఘీభావ కార్యక్రమాల్ని నిర్వహిస్తాం. సంఘీభావ కార్యక్రమాలను ఉదఅతం చేస్తాం.” అని అంగన్‌వాడీ నేతలు పిలుపునిచ్చారు.

➡️