ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం

May 25,2024 17:46 #mlc elections, #Telangana

హైదరాబాద్‌ : ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ప్రధాన పార్టీల మధ్య హౌరాహౌరీగా సాగిన ప్రచారం ఈ రోజు(25 శనివారం) 3.30 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ నెల 27న మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు జూ 5న వెలువడనున్నాయి. బరిలో తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), రాకేష్‌ రెడ్డి (బిఆర్‌ఎస్‌), ప్రేమేందర్రెడ్డి (బిజెపి) ఉన్నారు.

➡️