తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..

Dec 7,2023 15:46 #ministers, #Telangana

హైదరాబాద్‌: తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్‌ రెడ్డితో పాటు 11 మంది నాయకులు మంత్రి పదవులు చేపట్టారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క తోపాటు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ లు తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. రేవంత్‌ రెడ్డితో పాటు భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

➡️