ప్రజల ఆదరణతో రికార్డు మెజార్టీతో గెలుస్తా

May 10,2024 15:18 #saradhi
  • టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి
    ప్రజాశక్తి-ఆగిరిపల్లి
    నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తనకు విశేష ప్రజాదరణ వస్తోందనీ, అందువల్ల వారి ఆదారాభిమానాలతో రికార్డు మెజార్టీతో గెలుపొందుతానని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి,జనసేన, బిజెపి కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారధి ధీమాన వ్యక్తంచేశారు. నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ఆయన గత కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కె.పి.సారధి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో నూజివీడు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తననూ, ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా పుట్టా మహేష్‌ యాదవ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను ఏ ప్రాంతానికి వెళ్లినా అన్ని ప్రాంతాల్లోని ప్రజానీకం హారుతులు ఇచ్చి దీవిస్తున్నారన్నారు. తనను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. నూజివీడు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తారన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికిప్రాధాన్యత ఇస్తానన్నారు. నూజివీడులో మామిడి పరిశ్రమలు ఏర్పాటుకు అనుబంధ పరిశ్రమల స్థాపనలు జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. నూజివీడు ప్రాంతంలో మునుపెన్నడూలేనివిధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. చంద్రబాబునాయుడుకు పరిపాలనా అనుబవం ఉందన్నారు. జగన్‌కు అది లేదన్నారు. అందుకే పాలనలో తప్పటడుగులు జరుగుతున్నాయన్నారు. జగన్‌ కంటే చంద్రబాబు ప్రభుత్వం 15 నుంచి 20 శాతం అదనంగా సంక్షేమ పథకాలను పెంచి అమలు చేస్తారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలకు చెందిన టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్దఎత్తున పాల్గంటున్నారు. పలువురి చేరిక చాట్రాయి మండలం మంకొల్లు గ్రామానికి చెందిన చిట్టిబమ్మల నాగేశ్వరావు, కలసాని రాంబాబు, విరిగొర్ల శివరామకృష్ణ, పసుపులేటి పవన్‌ కుమార్‌, వీరబోయిన గోపి కృష్ణ, వీరబోయిన నాగు, కొప్పుల సురేష్‌, ఇమ్మడి శ్రీనివాసరావు, వీరబోయిన ఆంజనేయులు, పసుపులేటి రాజకుమార్‌, గుఒట్రు సురేష్‌, ఇమ్మడి నాగేశ్వారావు, వీరబోయిన శివ కుమార్‌, గణపతి బాబు, కొప్పుల హరీష్‌తోపాటు మరో 50 కుటుంబాల వారు టిడిపిలో చేరారు. వీరందరికీ కె.పి.సారధి టిడిపి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిడిపి చేరిన నాయకులు మాట్లాడుతూ నూజివీడు ఎమ్మెల్యేగా కె.పి. సారధిని గెలిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గన్నారు. బ్యాలెట్‌ నమూనా ప్రదర్శన కార్యక్రమం చాట్రాయి మండలం నరసింహారావు పాలెంలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా నాయకులు పుచ్చకాయల నోబుల్‌ రెడ్డి, తెలుగుదేశం గ్రామ పార్టీ అధ్యక్షులుఅందె కృష్ణ, గ్రామ ప్రచార కమిటీ చైర్మన్‌ కట్టా నాగ దుర్గారావు తదితరులు పాల్గన్నారు. నేడు సారధి పర్యటన వివరాలు శనివారం ఉదయం 8 గంటలకు పోతురెడ్డిపల్లి గ్రామంలోనూ, 10 గంటలకూ గొల్లపల్లి గ్రామంలోనూ జరిగే ఎన్నికల ప్రచారంలో కె.పి.సారధి పాల్గంటారు. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంనూజివీడు పట్టణంలో పైడి అప్పారావు కళ్యాణ మండపంలో గంధం నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం,జనసేన,బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్ధసారధి హాజరై మాట్లాడారు. ఈ నెల 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓట్లేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ కందుల సత్య నారాయణ, పందింటి కిషోర్‌, సముద్రాల శ్రీధర్‌, మిరియాల కృష్ణ, గంధం భాస్కరరావు తదితరులు పాల్గన్నారు. 
➡️