ఎన్టీఆర్‌ జిల్లాలో 8.39 కోట్ల నగదు పట్టివేత

May 9,2024 07:30 #money sized, #ntr district

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎక్కడ చూసినా ముమ్మరంగా తనిఖీలు పోలీసులు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర సరిహద్దు జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు వద్ద.. తాజాగా భారీగా నగదు సీజ్‌ చేశారు.. హైదరాబాద్ నుండి గుంటూరుకు లారీలో భారీగా క్యాష్ తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.. దీంతో.. తనిఖీలు విస్తృతంగా చేశారు.. ఆ తనిఖీల్లో ఓ లారీలో తరలిస్తున్న 8.39 కోట్ల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సొమ్మును సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించారు.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకొని విచారణ జరుగుతున్నారు. ఈ క్యాష్ ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరి కోసం తీసుకెళ్తున్నారు.. ఎవరు ఇచ్చారు? లాంటి విషయాలపై కూపీలాగుతున్నారు.

➡️