పోస్టల్‌ బ్యాలెట్ల నిబంధనల సడలింపుపై ఉత్తర్వులు ఇవ్వలేం : హైకోర్టు

ప్రజాశక్తి, అమరావతి : పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించి రాష్ట్రంలో కొన్ని అంశాల్లో నిబంధనల సడలింపుపై ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై తాము ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పోస్టల్‌ బ్యాలెట్‌కు సంబంధించిన డిక్లరేషన్‌ ఫాంపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, పేరు, హోదా, సీలు లేకపోయినా కూడా వాటిని అనుమతించాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను వైసిపి సవాల్‌ చేసిన వ్యాజ్యంలో ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా ఈ వ్యవహారంపై ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అలాంటి పోస్టల్‌ బ్యాలెట్లను ఆమోదించాలని రిటర్నింగ్‌ అధికారులను ఇసి ఆదేశిస్తూ వైసిపి దాఖలు చేసిన వ్యాజ్యం పరిష్కారిస్తున్నట్లు ప్రకటించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికల పిటిషన్లు (ఇపి) దాఖలు చేసుకోవాలని వైసిపికి సూచించింది.
కేంద్రం ఎన్నికల సంఘం గురువారం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ వైసిపి ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ మండవ కిరణ్మయి, జస్టిస్‌ న్యాపతి విజరుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శనివారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోరాదన్న ఇసి వాదనతో ఏకీభవించింది. పోస్టల్‌ బ్యాలెట్స్‌ లెక్కింపు కూడా ఎన్నికల ఫలితాల కిందకే వస్తుందని చెప్పింది. ఈ వివాదాన్ని ఎన్నికల పిటిషన్‌ ద్వారా తేల్చుకోవాలేగానీ కోర్టుల్లో సాధారణ కేసుల ద్వారా కాదని స్పష్టం చేసింది. ఈ వివాదం రాష్ట్ర తోసిపుచ్చింది. ఏపీలో జరిగిన చట్టసభ సా అసెంబ్లీలోని మొత్తం175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్‌ సీట్ల ఫలితాలతో ముడిపడి ఉందని, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎన్నికల పిటిషన్లు దాఖలు చేయడం కష్టమని పిటిషనర్‌ వాదనను కానీ, కొన్ని స్థానాలకు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంపై ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చిందన్న వాదనను కానీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

➡️