మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ.. సంబంధిత రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని హైకోర్టులో అంజిరెడ్డి అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. అయితే, అఫిడవిట్‌లో అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్‌ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

➡️