నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 11:27 #Nellore District, #police, #TDP

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి నారాయణ, మహిళా నేత విజితారెడ్డితో పాటు 15 మంది టీడీపీ నేతల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. విజితారెడ్డి ఇంట్లో సోదాల విషయం తెలుసుకున్న నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌ రెడ్డి.. ఆమె నివాసానికి చేరుకున్నారు.. ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️