విజయవాడ అభివృద్ధి చెందాలంటే సిపిఎంకు ఓటు వేయండి : సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం సింగ్‌ నగర్‌ రాజీవ్‌ నగర్‌ హుడా కాలనీ లో ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు కమ్యూనిస్టులకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … విజయవాడ అభివృద్ధి చెందాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సింగ్‌ నగర్‌ దగ్గర నుండి రాజీవ్‌ నగర్‌ కండ్రిక వరకు ఎలాంటి అభివృద్ధి జరిగినా కమ్యూనిస్టులు కార్పొరేటర్‌ గా ఉన్న సమయంలో జరిగిందని చెప్పారు. పట్టాలు రిజిస్ట్రేషన్‌ ఇచ్చిన ఘనత కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిందని, మోడీ, చంద్రబాబు నాయుడు గతంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని అదే విధంగా ప్రస్తుతం ఉన్న వైసిపి ప్రభుత్వం కూడా మోడీకి మద్దతు పలుకుతుందని అన్నారు. పేదలకు నివసించడానికి ఇల్లు లేవు.. అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు కానీ ప్రభుత్వానికి ఇలాంటివి ఏమీ పట్టవని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న టిడిపి, వైసిపి, జనసేన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపి మోడీ తో కలిసి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు కలిసి పరిపాలన చేశారని గుర్తు చేశారు. చెత్త పన్ను, కరెంటు పన్ను, నీటి పన్ను, నిత్యావసర ధరలు అధికమయ్యాయే తప్ప సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. బిజెపి, టిడిపి, వైసిపి ప్రభుత్వాలు పేదల నోట్లో మట్టి కొట్టాయని, బిజెపి అధికారంలోకి వచ్చాక సామాన్యులపై అధికంగా జీఎస్టీ వసూలు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులకు ఓటు వేయాలని కోరారు. సామాన్యులకు అందుబాటులో ఉండే వ్యక్తులు కమ్యూనిస్టులు అని పిలిస్తే పలికే వ్యక్తులు చిగురుపాటి బాబురావు అని ప్రజల కోసం పోరాడే వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని సిపిఎం అభ్యర్థికి ఓట్లు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణ రావు, కే.దుర్గారావు, సిపిఎం రాష్ట్ర నాయకులు కే శ్రీదేవి, చింతల శీను, ఎస్‌.కె.నాగేశ్వరరావు, రాంబాబు, సాంబిరెడ్డి, అమ్ములు, ఝాన్సీ ప్రసాద్‌, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

➡️