పెనుకొండలో టీడీపీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు..

Feb 24,2024 14:47 #Dharna, #Sri Satya Sai District, #TDP
  •  పార్టీ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు దగ్ధం

ప్రజాశక్తి -పెనుకొండ (శ్రీసత్య సాయి) : జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయం వద్ద శనివారం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథికి ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో ఆగ్రహ జ్వాలలు వెళ్లువెత్తాయి. ఈ సందర్భంగా టిడిపి కార్యకర్తలు ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బి.కె. పార్థసారథి వెంట మేము నడుస్తాం అంటూ తెగేసి చెప్పారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

➡️