ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

Mar 1,2024 09:49 #Andhra Pradesh, #inter exams, #start

ప్రజాశక్తి-యంత్రాంగం : ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా హాల్‌ లోపలికి అనుమతించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను లోపలికి అనుమతించబోమని అధికారులు ముందే ప్రకటించడంతో పరీక్ష రాసే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. దూర ప్రాంతాలకు చెందినవారు 8 గంటలకే కేంద్రాలకు చేరుకున్నారు. మరో వైపు విద్యార్థులను వారి తల్లిదండ్రులు బైక్‌లపై, ఆటోల్లో తీసుకొచ్చారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాల్‌ టికెట్‌, పెన్‌, అట్ట తప్ప ఎలాంటి ఇతర వస్తువులు లోపలికి అనుమతించలేదు. మొదటి ఏడాది పరీక్ష రాస్తుండటంతో విద్యార్థుల వెంట తల్లిదండ్రులు వచ్చి శుభాకాంక్షలు చెప్పి పంపించారు. ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిఘా నీడలో జరుగుతున్నాయి. ఈనెల 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

విశాఖ : ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ హాజరైన విద్యార్థులు… ఏఎస్ రాజా కాలేజ్, కృష్ణ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్

inter exams in eluru

ఉమ్మడి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభం అయిన ఇంటర్ పరీక్షలు…

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు హడావిడి…

మన్యం జిల్లా : వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం కు చేరుకున్న విద్యార్థులు

➡️