కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

Jan 30,2024 12:14 #inter student, #suside

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు శాంతినగర్‌ కస్తూర్బా ప్రిన్సిపాల్‌ తరలించారు. ప్రస్తుతం అక్షిత మృతదేహం మార్చురిలో ఉంది. అక్షిత స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడిపల్లి గ్రామం.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్షిత ఒక సూసైడ్‌ నోట్‌ కూడా రాసినట్లు.. అందులో తన కుటుంబ సభ్యులతో పాలు స్నేహితుల పేర్లు రాసి వారికి క్షమాపణ చేప్పినట్లు పోలీసులు తెలిపారు. కాలేజీలో తమ కూతురికి సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్‌కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️