ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Dec 26,2023 16:10 #cpm v srinivasarao, #press meet

నెల్లూరు:  ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అంటూ సీఎం జగన్‌పై సీపీఎం నేత శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ఏపీలో అస్సలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం వస్తుంది. సీఎం జగన్‌… నా అక్కచెల్లెమ్మలు అంటుంటారు. 15 రోజులుగా అంగన్‌ వాడీ ఆడబిడ్డలు రోడ్డు ఎక్కితే పట్టించుకోరు. ఏపీలో 30 లక్షల మంది తల్లులు, పిల్లలకి పౌష్టికాహారం అందడం లేదు. మా నమ్మకం నువ్వే అంటారు. ఇదేనా నమ్మకం. అన్ని విభాగాల కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, కార్మికులు సమ్మెలకు దిగుతున్నా పట్టించుకోరు. ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయి. లేకుంటే రూ.20 వేల కోట్లుతో స్మార్ట్‌ మీటర్లు ఎలా పెడుతున్నారు. అది కూడా అదానీకి అప్పగించారు. కరెంటు బిల్లులకంటే అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ జనం మాడు పగులగొడుతున్నారు.” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

➡️