మాయ మాటలతో గద్దెనెక్కి.. రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టిన జగన్‌ : లోకేష్‌

Feb 17,2024 16:12 #Nara Lokesh

ప్రజాశక్తి – లక్కవరపుకోట (విజయనగరం) : ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్‌ రెడ్డికి అధికారం రాగానే అహంకారం పెరిగిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దుయ్యబట్టారు. తుగ్లక్‌ పాలన సాగిస్తూ రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి నెట్టారని ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో లక్కవరపుకోట , వేపాడ మండలాలు సరిహద్దులో గల సోంపురం జంక్షన్‌ వద్ద శనివారం ఏర్పాటు చేసిన ”శంఖారావం” కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. వైసిపి పాలనంత భూకబ్జాల మయమైందన్నారు. ప్రభుత్వ భూములు , చెరువులు ఆక్రమించుకుని రూ వేలకోట్లు ప్రజాధనాన్ని వైసిపి నాయకులు దోచుకున్నారన్నారు. రౌడీయిజం , దౌర్జన్యాలతో రాష్ట్రం అతలాకుతం అయిందని ఆరోపించారు. ఎస్‌ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కొత్తవలస లో భూములు ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేసుకోలేదాని ప్రశ్నించారు. పెందుర్తి నుండి ఎస్‌.కోట మీదుగా అరకు వెళ్లే ప్రధాన రహదారి ఆరు లైన్ల పనులు గాలికి వదిలేసారన్నారు. సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని నమ్మబలికి అధికారం ఎక్కిన జగన్‌ నాసిరకమద్యాలతో ప్రజల ఆరోగ్యాలు కొల్లగొడుతున్నారు అన్నారు. తన పార్టీ అధికారంలోకి రాగానే క్షణమే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకు నిరుద్యోగ భతి కింద పట్టభద్రుడైన ప్రతి నిరుద్యోగికి నెలకు రూ 3500 చెల్లిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ,18 నుండి 50 ఏళ్ల మధ్యగల ప్రతి మహిళలకు తన పదవీకాలం అంతా కలుపుకుని రూ 90 వేలు ఇస్తామన్నారు. ప్రతి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. రైతుల అభివద్ధి కోసం ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ 20 వేలు తమ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇసుక దందా, గంజాయి , నాసిరక మద్యం వ్యాపారాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన సూపర్‌ – 6 హామీలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రచారాలు చేసేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. లక్కవరపుకోట , శృంగవరపుకోట, కొత్తవలస , వేపాడ , జామి తదితర మండలాల నుండి తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన మండల స్థాయి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. నారా లోకేష్‌ తో పాటు వేదికపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొప్ప కృష్ణ , శృంగవరపుకోట, గాజువాక మాజీ శాసనసభ్యులు కోళ్ళ లలితకుమారి , పల్లా శ్రీనివాసరావు , పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీఅప్పలరాంప్రసాద్‌ , జనసేన పార్టీ శంగవరపుకోట సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ తదితరులను ఉన్నారు.

➡️