23 వేల టీచర్‌ పోస్టులేవీ?

Congress Election Committee headed by Sharmila
  •  సిఎం జగన్‌కు ఎపిసిసి అధ్యక్షులు షర్మిల ప్రశ్న

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ‘జాబు రావాలంటే జగన్‌ కావాలని’ నినాదం ఇస్తూ ఘరానా మోసానికి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తెరలేపారని ఎపిసిసి చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఆరోపించారు. జాబు కావాలంటే బాబు రావాలని టిడిపి అధినేత చంద్రబాబు చేసిన మోసం చాలదంటూ.. జగన్‌ కూడా ఇటువంటి నినాదం ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని గురువారం ట్విట్టర్‌ వేదికగా ఆమె ఆరోపించారు. ‘2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన మీరు అయిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మ విమర్శ చేసుకోండి’ అని సిఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏటా జాబ్‌ కేలండరు అని, జంబో డిఎస్‌సి అని, ఎపిపిఎస్‌సి నుంచి వరుస నోటిఫికేషన్లు అని నమ్మించి నిరుద్యోగులను జగన్‌ నిండా ముంచారని, ఆయన మోసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ లాంటివారని విమర్మించారు. వైసిపి అవసరాల కోసం వలంటీరు వ్యవస్థను తెచ్చి 2 లక్షల ఉద్యోగాలు నింపామని చెప్పుకోవటం తప్పా.. గౌరవంగా చెప్పుకునే ఒక్క ఉద్యోగం అయినా భర్తీ చేశారా? అని ప్రశ్నించారు.

➡️