రాజోలులో జనసేన ముందంజ

Jun 4,2024 12:50 #JanaSena, #Rajolu

ప్రజాశక్తి-రాజోలు (కోనసీమ) : ఎపి ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది రాజోలు నియోజకవర్గం ఏడవ రౌండ్‌ పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు పై జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్‌ 15,969 ఓట్లతో ముందంజలో ఉన్నారు. రాజోలులో దాదాపు జనసేన గెలుపు ఖరారు అయింది. 2019 లో రాజోలులో గెలిచిన జనసేన 2024 లో అదే ఊపుతో మరోసారి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన లెక్కింపులో వైసిపికి 28,015 ఓట్లు, జనసేన కు 43,984 ఓట్లు దక్కాయి.

➡️