నేటితో ముగియనున్నజేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు

Mar 2,2024 12:23 #JEE

ప్రజాశక్తి-అమరావతి : జేఈఈ మెయిన్‌ చివరి విడత దరఖాస్తుకు శనివారంతో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 4-15 మధ్య ఆన్లైన్‌ పరీక్షలు జరుగుతాయని జాతీయ పరీక్షల సంస్థ గతంలోనే ప్రకటించింది. తొలి విడతకు 12.21 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11.70 లక్షల మంది పరీక్ష రాశారు. చివరి విడత పూర్తయిన తర్వాత ఏప్రిల్‌ 20న ర్యాంకులు వెల్లడిస్తారు.

➡️