‘కెఆర్‌ఎంబి కార్యాలయాన్నివిజయవాడలో ఏర్పాటు చేయాలి’

Feb 5,2024 20:16

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కృష్ణానదీ యజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని ఎపి సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆళ్ల వెంకటగోపాల కృష్ణారావు కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని కెఆర్‌ఎంబి కార్యాలయానికి వెళ్లి కృష్ణాబోర్డు ఛైర్మన్‌ శివనందన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానదీ పరివాహక ప్రాంతంతో ఎలాంటి సంబంధం లేని విశాఖపట్నంలో కెఆర్‌ఎంబి కార్యాలయం పెట్టడం సరైందికాదని తెలిపారు. కెఆర్‌ఎంబి కార్యాలయం విజయవాడలో వుంటే రైతులకు, అధికారులకు సౌలభ్యంగా వుంటుందని తెలిపారు. తక్షణం విజయవాడలో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️