లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ

తుని (కాకినాడ) : ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ఉదయం పైలాన్‌ను ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోకేశ్‌ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌, నందమూరి బాలకఅష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌, బాలకఅష్ణ కుమారుడు మోక్షజ్ఞ హాజరయ్యారు. పెద్ద ఎత్తున టిడిపి నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

➡️