Election Code: లోకేష్‌ కాన్వాయ్ తనిఖీ

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కాన్వాయ్ ను ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆపారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని చెప్పడంతో ఆయన సహకరించారు. కాన్వాయ్ లోని కార్లు అన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఏమీలేదని పోలీసులు నిర్ధరించిన అనంతరం కాన్వాయ్ ను పంపించారు. తాడేపల్లిలోని అపార్ట్మెంట్‌ వాసులతో ముఖాముఖి కార్యక్రమానికి వెళ్తుండగా ఈ తనిఖీలు జరిగాయి.

➡️