ఎపిలో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యం : లోకేశ్‌

అమరావతి : ఎపి లో ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ సృష్టించడమే లక్ష్యంగా పని చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సమృద్ధి అపార్టుమెంట్‌ వాసులతో లోకేశ్‌ సమావేశమై మాట్లాడారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడానికి విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ఒక్క విద్యాసంస్థనైనా తీసుకొచ్చారా ? అని ప్రశ్నించారు. గంజాయికి ఎపి అడ్డాగా మారిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంటి, చెత్తపన్ను సామాన్యుడికి భారంగా మారాయని లోకేశ్‌ అన్నారు.

➡️