ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు

Dec 27,2023 15:40 #road accident

దేవరకద్ర : ఆటో బోల్తా పడి వ్యక్తి మఅతి చెందిన సంఘటన దేవరకద్ర మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవరకద్ర నుండి కౌకుంట్ల మండలానికి వెళ్తున్న ఆటో కస్తూర్బా పాఠశాల హాస్టల్‌ దగ్గర ఆటో బోల్తా పడటంతో వెల్కిచర్ల గ్రామానికి చెందిన ముష్టి చెన్నప్ప( 55) మృతి చెందాడు.అతని భార్య చెన్నమ్మ కు, కౌకుంట్ల మండలానికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ సంజీవరెడ్డికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నామని మఅతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు దేవరకద్ర ఎస్‌ ఐ కే.వెంకటేష్‌ తెలిపారు.

➡️