జనసేనలో చేరిన బుద్ధ ప్రసాద్‌

Apr 1,2024 17:23 #JanaSena, #Join Another Party

ప్రజాశక్తి-అవనిగడ్డ : కృష్ణా జిల్లా అవనిగడ్డ అభ్యర్థి విషయంలో సందిగ్థతకు తెరపడింది. టిడిపి నేత బుద్ధ ప్రసాద్‌ సోమవారం జనసేనలో చేరి సీటు సంపాదించారు. తన తనయుడు మండలి వెంకట్రావు, అనుచరులతో కలిసి కాకినాడ జిల్లా పిఠాపురం వెళ్లి పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. బుద్ధ ప్రసాద్‌కు పార్టీ కండువా కప్పి పవన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. గత మూడు రోజులుగా బుద్ధ ప్రసాద్‌ పార్టీ మారతారనే వార్త దివిసీమలో చక్కర్లు కొట్టింది. రెండు రోజుల క్రితం ఆయన ప్రధాన అనుచరు లతో సమావేశం నిర్వహించి జనసేన పార్టీలో చేరాలనే విషయాన్ని ప్రకటించినట్లు తెలిసింది.

➡️