బాలల పండుగ బాలోత్సవంకు విశేష స్పందన

Dec 21,2023 14:06 #Balotsavam
mangalagiri-radepalli balotsavam

బాలోత్సవం ను ప్రారంభించిన ఎంటీఎంసీ కమిషనర్ నిర్మల్ కుమార్

తరలివచ్చిన చిన్నారులు

ప్రజాశక్తి-మంగళగిరి రూరల్: మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని ఎర్రపాలెం డాన్ బాస్కో హై స్కూల్ నందు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం రెండవ పిల్లల పండగ కార్యక్రమం గురువారం ఉత్సాహపూరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ ఉత్సవాలను ఎంటిఎంసి కమిషనర్ నిర్మల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభకు నిర్మల కళాశాల ప్రిన్సిపాల్, బాలోత్సవం అధ్యక్షులు వివి ప్రసాద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ కుమార్ మాట్లాడుతూ చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ రాణించి పరిపూర్ణమైనటువంటి విద్యార్థిగా ఎదగాలని అటువంటి వాటికి వారధిగా ఈ బాలోత్సవాలు నిలుస్తాయన్నారు. చిన్ననాటి నుండి పోటీ తత్వాన్ని పెంపొందించుకొని సృజనాత్మకతకు నైపుణ్యానికి జోడించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాల్సిన అవసరం నేడు ఉందని ఉద్ధాటించారు. ఇటువంటి ఉత్సవాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఇతర ప్రముఖులు మాట్లాడుతూ పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు ఉన్నత స్థాయిని చేరుకునేందుకు ఇటువంటి బాలోత్సవాలు దోహదపడతాయని పేర్కొన్నారు. చిన్ననాటి నుండి ఇటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. ఎల్లప్పుడు చదివే కాదని ఇతర అంశాలను రాణించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు అకాడమి క్ ప్రదర్శనలకు డాన్ బాస్కో హై స్కూల్ వేదికగా మారింది. ఆయా ప్రదర్శనలను తిలకించేందుకు వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రజలు అక్కడకు చేరుకొని శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక కళా ప్రదర్శనలను తిలకించారు.
ఈ కార్యక్రమంలో భాగోత్సవం వ్యవస్థాపకులు వాసిరెడ్డి రమేష్ బాబు, కాకినాడ క్రియా నిర్వహకులు ఎస్ ఎస్ ఆర్ జగన్నాధ రావు, అమరావతి బాలోత్సవం వ్యవస్థాపకులు నిర్వాహకులు పిన్నమనేని మురళీకృష్ణ, బాలోత్సవం గౌరవ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సి కె కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మంచా విజయ రామ్మోహన్రావు, గోపాలం సాంబశివరావు, ఆర్ ఆదినారాయణ, బాలోత్సవం కార్యదర్శి జె శేషయ్య, శ్రీలక్ష్మి, విజే. కళాశాలల డైరెక్టర్ పి రాజశేఖర్, చాంబర్ ఆఫ్ కామర్స్ మంగళగిరి అధ్యక్షులు వీసం వెంకటేశ్వరరావు, ఎస్ ఎల్ ఎం చైతన్య హై స్కూల్ డైరెక్టర్ శిందే బాలకృష్ణ, కోశాధికారి గాదే సుబ్బారెడ్డి, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు.

➡️