పులివెందులలో ముఖ్యమంతి జగన్‌ తరఫున మనోహర్‌రెడ్డి నామినేషన్‌

Apr 22,2024 22:42 #ap cm jagan, #nomination

ప్రజాశక్తి- పులివెందుల టౌన్‌ : వైఎస్‌ఆర్‌ జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయనకు బాబారు వరుసయ్యే వైఎస్‌.మనోహర్‌రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్‌డిఒ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వెంకటేష్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25న జగన్‌మోహన్‌రెడ్డి రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారని తెలిపారు. అనంతరం పులివెందులలో భారీ బహిరంగ సభ జరగనుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️