26, 27 తేదీల్లో పంటల ప్రణాళికపై సమావేశం

Apr 24,2024 09:13 #sagu

ప్రజాశక్తి-ఘంటసాల
ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26,27 తేదీల్లో గుంటూరు లాంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కృష్ణా మండల వ్యవసాయ పరిశోధనా, విస్తరణ సలహా సంఘ సమావేశాలు జరుగుతాయని ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.శ్రీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు పాల్గంటారని పేర్కొన్నారు. రాబోయే ఖరీఫ్‌, రబీ కాలాల్లో వివిధ పంటలపైనున్న సమస్యలు, చేపట్టాల్సిన పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలపై చర్చిస్తారని పేర్కొన్నారు. అభ్యుదయ రైతు సోదరులు ఈ సమావేశాల్లో పాల్గని పంటలపై తమ అమూల్యమైన సలహాలను అందజేయాల్సిందిగా కోరారు.

➡️