ఆటోను డీకొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనం – యువకుడు మృతి

ప్రకాశం : మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం తెల్లవారుజామున త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. నేడు ప్రకాశం జిల్లాలో సిఎం పర్యటన నేపథ్యంలో … విజయవాడ నుంచి మంత్రి సురేష్‌ మార్కాపురంకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ముందు వాహనంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఉన్నారు. మంత్రి వెనుక వస్తున్న వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇజ్రాయిల్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రుడిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️