చంద్రబాబుకు ప్రజల సమస్యలు పట్టవు : మంత్రి కారుమూరి

ప్రజాశక్తి-తణుకు(పశ్చిమగోదావరి): ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదని.. ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యాదీవెన, చేయూత పథకాలను ఎన్నికల సంఘం ఆపేసిందని మంత్రి కారుమూరి తెలిపారు. దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందని పేర్కొన్నారు. ఫించన్ల పంపిణీలో అడ్డంకులు సృష్టించిన చంద్రబాబు ఇప్పుడు విద్యాదీవెన, చేయూత పథకాలను అమలు చేయకుండా అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలో చంద్రబాబును ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. రానున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

➡️