బిజెపి మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోంది: మంత్రి కోమటిరెడ్డి

Apr 11,2024 13:18 #Minister Komati Reddy, #speech

హైదరాబాద్‌: మతాలు, కులాల మధ్య బిజెపి చిచ్చు పెడుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ శిందేలు ఎవరూ లేరని.. ఆయన్ను సఅష్టించిందే బిజెపి అని వ్యాఖ్యానించారు. తామంతా రేవంత్‌ నాయకత్వంలో పని చేస్తున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు, బిజెపి శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్‌ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే.. తాను దేనికైనా సిద్ధమేనన్నారు.

➡️