బక్రీద్‌ వేళ .. ఈద్గాలో ప్రార్థనలు చేసిన మంత్రి లోకేష్‌

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని … విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ మంగళగిరి అంజుమన్‌- యి- హిమాయతుల్‌ ఇస్లాం ఈద్గాను సోమవారం సందర్శించారు. ముస్లిం సోదరులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్‌ వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈద్గా వద్ద యువనేతకు ఘనస్వాగతం లభించింది. లోకేష్‌ మాట్లాడుతూ … ఇస్లాంలో త్యాగం, దానగుణాలకు ప్రత్యేకమైన స్థానముందన్నారు. ప్రవక్త ఇబ్రహీం మహౌన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకునే పండుగ ఈద్‌ అల్‌ అదా (బక్రీద్‌) సమాన భావన పెంపొందిస్తుందని అన్నారు. ప్రజలు యువనేత దఅష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారానికి కఅషి చేస్తానని లోకేష్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, టిడిపి పట్టణ కార్యదర్శి షేక్‌ రియాజ్‌, ఎండి ఇబ్రహీం, షేక్‌ సుభాని, తదితరులు పాల్గొన్నారు.

➡️